English | Telugu

తొలిప్రేమలో ఆ క్యారెక్టర్ చేసుంటే..!!

డెస్టెనీ.. లక్.. అదృష్టం.. పేరు ఏదైనా కానీ.. ఇలాంటిది ఒకటుందని నమ్మక తప్పదు. సినీరంగానికి ఇది ఎక్కువ వర్తిస్తుంది. కొన్నిసార్లు ఎవరో చేయాల్సిన ఫ్లాప్ సినిమా ఇంకెవరి చేతికో వెళ్తుంది.. అలాగే కొన్నిసార్లు ఒకరు చేయాల్సిన సూపర్‌హిట్ సినిమా ఇంకొకరి చేతికి వెళ్లిపోతుంది. సినిమా హిట్టైనప్పుడు అర్రె ఈ సినిమా చేసుంటే బాగుండేదని.. సినిమా ఫ్లాపైతే.. ఆ సినిమా వదులుకోవడం మంచికే జరిగిందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలా ఓ గోల్డెన్ ఛాన్స్‌ని మిస్ చేసుకుని ఇప్పుడు తలపట్టుకుంది హీరోయిన్ మెహ్రీన్ కౌర్. కృష్ణగాడి వీర ప్రేమకథతో తెలుగువారికి పరిచయమైన మెహ్రీన్ కౌర్ ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్లింది. ఇలాంటి సమయంలోనే ఓ మెగా ఆఫర్ మెహ్రీన్ కౌర్ దగ్గరకొచ్చిందట. అదే తొలిప్రేమ..

వరుణ్ తేజ్ పక్కన ఫస్ట్‌ మెహ్రీన్ అయితే బాగుంటుందని భావించిన దర్శకుడు వెంకీ అట్లూరి‌.. ఆమెను సంప్రదించడం.. కథ చెప్పడం అన్నీ జరిగిపోయాయి. అయితే రోజు రోజుకి ఆమె బరువు పెరగడం చూసి.. మెహ్రీన్‌ను తప్పించి ఆమె ప్లేస్‌లో రాశీఖన్నాను సెలెక్ట్ చేశాడట వెంకీ. తీరా సినిమా విడుదలైన తర్వాత రాశీ నటనకు ప్రేక్షకులు ఫిదా అవ్వడంతో.. ఆమెకు కెరీర్‌లోనే ఒక మెమొరబుల్ హిట్‌గా నిలిచింది "తొలిప్రేమ". బొద్దుగా ఉంటేనే ఆడియన్స్‌ తనను ఇష్టపడుతున్నారని అలాగే కంటిన్యూ అవుతున్న మెహ్రీన్.. ఈ దెబ్బతో జిమ్‌లో వర్కవుట్లు మొదలెట్టిందట.