English | Telugu

కన్నుగీటి నిఖిల్‌ను పడేసింది..?

వయ్యారంగా కన్నుగీటి.. ఎక్స్‌ప్రెషన్స్.. లుక్స్‌తో ఓవర్‌నైట్‌లో నేషనల్ సెన్సేషన్ అయిపోయింది కేరళ కుట్టి ప్రియా వారియర్. ఈ పాపులారిటీ ఆమెకు అనుకోని అవకాశాలను సైతం తెచ్చిపెడుతోంది. సహజంగానే కొత్త అందాలను వెతికి మరీ తీసుకువచ్చే తెలుగు చిత్ర పరిశ్రమ చూపు ప్రియపై పడింది. దీనిలో భాగంగా యంగ్ హీరో నిఖిల్‌తో పెళ్లిచూపులు ఫేం తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న మూవీలో.. ప్రియా వారియర్‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్లుగా ఓ వార్త ఫిల్మినగర్‌లో చక్కర్లు కొడుతోంది.

నిఖిల్ నటించిన కిర్రాక్ పార్టీ సమ్మర్‌లో రిలీజవుతోంది. ఈ మధ్య తరుణ్ భాస్కర్ చెప్పిన కథ నచ్చడంతో.. దానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.. ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది సినిమాతో బిజీగా ఉన్న తరుణ్‌ ఇది పూర్తి చేసి... నిఖిల్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడు. ఈ సినిమాకి ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందని భావించి ప్రియ వారియర్‌‌‌ పేరు పరిశీలిస్తున్నారు. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.. ప్రియా వారియర్‌కు సంబంధించిన విషయాల కోసం యూత్ విపరీతంగా బ్రౌజ్ చేస్తున్న నేపథ్యంలో.. తెలుగు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.