English | Telugu

ఒకటైతే ఒకే.. మిగతావాటి పరిస్థితి ఏంటీ..?

సుకుమార్ సినిమాల్లో కథ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో.. ఆడియో కూడా అంతే ఫ్రెష్‌గా ఉంటుంది. "ఆర్య" దగ్గరి నుంచి "నాన్నకు ప్రేమతో" వరకు ప్రతి సినిమాలోనూ సాంగ్స్‌ ఆదిరిపోయాయి. పాటలు బాగుంటే.. సగం సినిమా హిట్టైనట్లేనని సుక్కు బలంగా నమ్ముతాడు. అందుకు తగ్గట్టుగానే అతని నమ్మకం ఎప్పుడూ వమ్ముకాలేదు. అతని ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సినిమా.. సినిమాకి రాకింగ్ ట్యూన్స్ ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు సుకుమార్ లేటెస్ట్ మూవీ "రంగస్థలాని"కి కూడా డీఎస్‌పీ ఆదరగొట్టే ట్యూన్స్ ఇచ్చాడని ఫిలింనగర్ టాక్.

ఇప్పటికే రిలీజైన మొదటి సాంగ్‌కు మ్యూజిక్ లవర్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపైనా అంచనాలు పెంచేసింది. దీంతో ఇప్పుడు అందరి చూపు సెకండ్ సాంగ్‌‌పై పడింది. ఆ పాట డ్యూయెట్టా లేక సోలో పర్ఫామెన్సా.. లేదంటే 80ల నాటి నాటు బీటా అని ఆడియన్స్ ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఇక సుకుమార్ సినిమా అంటే ఐటెం సాంగ్‌ మస్ట్‌గా ఉండాల్సిందే. పూజా హెగ్డేతో మాస్ టేస్ట్‌కు తగ్గట్టుగా.. అదిరిపోయే స్టెప్స్‌ వేయించాడట సుక్కు.. ఇలాంటి ఊహాగానాల నేపథ్యంలో రంగస్థలంలోని మిగిలిన పాటల కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.