English | Telugu

యన్ టి ఆర్ వెంటపడుతున్న ప్రియమణి

యన్ టి ఆర్ వెంటపడుతున్న ప్రియమణి అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే క్రియెటీవ్ కమర్షియల్స్ పతాకంపై, యన్ టి ఆర్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా, బోయపాటి శీను దర్శకత్వంలో, కె.యస్.రామారావు నిర్మిస్తున్న చిత్రం "చురకత్తి". గతంలో యన్ టి ఆర్ సరసన "యమదొంగ" చిత్రంలో ప్రియమణి హీరోయిన్ గా నటించింది. ప్రముఖ హీరోయిన్ ప్రియమణికి ప్రస్తుతం జగపతిబాబు హీరోగా నటిస్తున్న "క్షేత్రం" సినిమా తప్ప వేరే ఇంకే సినిమాలూ లేవట.

దాంతో ప్రస్తుతం యన్ టి ఆర్ హీరోగా నటిస్తున్న "చురకత్తి" సినిమాలో సెకెండ్ హీరోయిన్ వేషం కోసం హీరో యన్ టి ఆర్ వెంటపడుతూందట. కానీ యన్ టి ఆర్ మాత్రం ఏ విషయం ఇంకా తేల్చిచెప్పలేదట. కాని ఈ సినిమాలో తాప్సి సెకెండ్ హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. తాప్సికే ఆ అవకాశం దక్కితే ప్రియమణి ప్రయత్నాలు ఏమవుతాయో మరి...!