English | Telugu

రామ్ చరణ్ కోసం సూర్యప్రకాష్ ఎదురుచూపు

రామ్ చరణ్ కోసం సూర్యప్రకాష్ ఎదురుచూపు చూస్తున్నాడని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు కోవెలమూడి సూర్యప్రకాశరావు తొలిసారి దర్శకుడిగా సిద్ధార్థ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా, "అనగనగా ఓ ధీరుడు" అనే సినిమాకి దర్శకత్వం వహించినా, ఆ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఆ సినిమా తర్వాత సూర్యప్రకాష్ ఒక చక్కని కథని తయారుచేసుకుని యువ హీరో రామ్ చరణ్ తేజకు వినిపించాడట. కథ విని బాగుందని సూత్రప్రాయంగా రామ్ చరణ్ అంగీకరించాడట. ఇదంతా రామ్ చరణ్ హీరోగా నటించిన "ఆరెంజ్" సినిమా విడుదలకు ముందు జరిగింది.

కానీ "ఆరెంజ్" విడుదలై ఘోరంగా ఫ్లాపవటంతో రామ్ చరణ్ అంతగా అనుభవం లేని కొత్త దర్శకులతో పనిచేయటానికి ఆలోచిస్తున్నాడట. అయినా సూర్యప్రకాష్, రామ్ చరణ్ చిన్ననాటి స్నేహితులు కాబట్టి ఈ సినిమాలో రామ్ చరణ్ నటించే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రస్తుతం మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, తమన్నా భాటియా హీరోయిన్ గా, సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న "రచ్చ" సినిమాలో హీరోగా రామ్ చరణ్ నటిస్తున్నాడు.