English | Telugu

దిల్ రాజుతో చేయకూడదనుకున్నా-ప్రభాస్

"దిల్ రాజుతో చేయకూడదనుకున్నా" అని యువ హీరో ప్రభాస్ అన్నారట. వివరాల్లోకి వెళితే యంగ్ రెబెల్ స్టార్ శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మించిన "మున్నా", "మిస్టర్‍ పర్ ఫెక్ట్" చిత్రాల్లో నటించారు. కానీ దిల్ రాజు నిర్మించిన "మున్నా" సినిమాలో నటించక ముందు ఒక సినిమా ఫంక్షన్ కి ప్రభాస్ ని దిల్ రాజు ఆహ్వానించాడట. అప్పుడు దిల్ రాజు ఆహ్వానించిన తీరు ప్రభాస్ కి ఆగ్రహం కలిగేలా ఉందట. అప్పుడు "ఇక దిల్ రాజుతో జన్మలో సినిమా చేయకూడద"ని నిర్ణయించుకున్నాడట ప్రభాస్.

 

కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల "మున్నా" సినిమాలో నటించాల్సి వచ్చిందట. కానీ ఆ సినిమా ఫ్లాపవటంతో దిల్ రాజు వచ్చి "సారీ ప్రభాస్ నీకు సరైన హిట్ సినిమా ఇవ్వలేకపోయాను" అని అన్నాడట. ఆమాటకు ప్రభాస్ మనసు కరిగిపోయిందట. అందుకే "మిస్టర్ పర్ ఫెక్ట్" సినిమాకు తాను వ్యక్తిగతంగా కథ విషయంలో బాగా ఇన్ వాల్వ్ అయ్యానని ప్రభాస్ అన్నాడట. దిల్ రాజుతో సినిమాలే చేయకూడదని నిర్ణయించుకున్న ప్రభాస్ ఇప్పుడు దిల్ రాజుతోనే సినిమాలు చేయాలనుకునేలా ప్రభావితుడయ్యాడు.