English | Telugu
వినాయక్ ని తప్పిస్తున్న మెగా ఫ్యామిలీ
Updated : Jun 14, 2011
వినాయక్ కి తప్పిస్తున్న మెగా ఫ్యామిలీ అని ఫిలిం నగర్ లో బలంగా వినపడుతూంది. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ అనుకున్న వివివినాయక్ దర్శకత్వంలో, అతన్ని నమ్మి 30 కోట్ల భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్ నిర్మించిన "బద్రీనాథ్" సినిమా ఊహించని విధంగా ప్రేక్షకుల చేత నిరాకరింపబడుతున్న నేపథ్యంలో, వినాయక్ ని మెగా ఫ్యామిలీ తప్పిస్తున్నట్లు తెలిసింది. నిర్మాణ దశలో "బద్రీనాథ్" సినిమా తెలుగు సినీ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తుందన్న మాటలు వినిపించాయి.
కానీ సినిమా రిలీజయ్యాక ఫలితం రివర్సయ్యింది. దాంతో మెగా ఫ్యామిలీ వినాయక్ ని అవాయిడ్ చేస్తూందట. రామ్ చరణ్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో సినిమా ఇప్పటికే క్యాన్సిల్ అయ్యిందట. అలాగే మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి నటించబోయే ప్రతిష్టాత్మక 150 వ చిత్రానికి ముందు వినాయక్ దర్శకుడుగా అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ ప్రోజెక్ట్ నుండి వినాయక్ ని తప్పించినట్లు సమాచారం. విజయం వస్తూ అందలం ఎక్కిస్తే, పరాజయం అధఃపాతాళానికి తొక్కుతుందంటే ఇదే కాబోలు.