English | Telugu
పిల్లలతో మోహన్ బాబు తలనొప్పి
Updated : Jun 7, 2011
పిల్లలతో మోహన్ బాబు తలనొప్పి మొదలయ్యిందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించిన మోహన్ బాబు పెదరాయుడు, మేజర్ చంద్రకాంత్ వంటి బ్లాక్ బస్టర్ హిట్లిచ్చాదు. కానీ ప్రస్తుతం ఆ బ్యానర్ ను కాదని మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణువర్థన్ "24 ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ" అనే నూతన నిర్మాణ సంస్థ ద్వారా తానే హీరోగా నటిస్తూ "వస్తాడు నా రాజు" అనే సినిమాని నిర్మించాడు. అది ఫ్లాపయ్యింది.
ఇక మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ కుమార్, కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న కలసి "మంచు ఎంటర్ టైన్ మెంట్స్" అనే నూతన నిర్మాణ సంస్థను స్థాపించి ఆ బ్యానర్ పై, రాజా అనే నూతన యువకుణ్ణి దర్శకుడిగా పరిచయం చేస్తూ "ఊ కొడతారా...ఉలిక్కి పడతారా..." అనే సినిమాని నిర్మిస్తున్నారు. అన్నదమ్ముల ఇద్దరి బ్యానర్లకూ మోహన్ బాబు సమర్పకుడుగా వ్యవహరిస్తున్నాడు. మార్కెట్లో గుడ్ విల్ ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్నఅనే ప్రముఖ బ్యానర్ ఇంట్లో ఉండగా, అన్నదమ్ములిద్దరూ చెరొక బ్యానర్ స్థాపించటం తండ్రిగా మోహన్ బాబుకి తలనొప్పి వ్యవహారంగా మారింది.