English | Telugu

తేజ సజ్జా షాకింగ్ రెమ్యునరేషన్!!

చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించిన తేజ సజ్జా.. హీరోగా మారి సత్తా చాటుతున్నాడు. ఇటీవల 'జాంబీ రెడ్డి' సినిమాతో అలరించిన ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'హనుమాన్' మూవీలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం తేజ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

అ!, కల్కి సినిమాల తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'జాంబీ రెడ్డి'. ఇందులో తేజ సజ్జా హీరోగా నటించాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'జాంబీ రెడ్డి' తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'హనుమాన్'. ఫస్ట్ ఇండియన్ సూపర్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలోనూ తేజ సజ్జానే హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ కోసం తేజ ఏకంగా కోటి రూపాయలను రెమ్యునరేషన్ గా పుచ్చుకుంటున్నట్టు సమాచారం.

తేజకు ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పడుతోంది. ఆయన సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కు బానే డిమాండ్ ఉంది. అందుకే నిర్మాతలు తేజకు కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఇక తేజ హీరోగా నటించిన మరో మూవీ 'ఇష్క్' విడుదలకు సిద్ధంగా ఉంది.