English | Telugu
'సలార్'లో కాజల్ స్పెషల్ సాంగ్!!
Updated : Jul 5, 2021
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. అందులో ఒక స్టార్ హీరోయిన్ కనిపించనుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సలార్ స్పెషల్ సాంగ్ కోసం కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.
కేజీఎఫ్ మూవీలో తమన్నా చేత స్పెషల్ సాంగ్ చేయించాడు ప్రశాంత్. ఇప్పుడు సలార్ లో స్పెషల్ సాంగ్ కోసం కాజల్ ను తీసుకున్నాడట. కాజల్ గతంలో ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన 'జనతా గ్యారేజ్' లో 'పక్కా లోకల్' అంటూ ప్రేక్షకులను అలరించింది. పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలు చేస్తూ.. బిజీగా ఉంటున్న కాజల్ సలార్ స్పెషల్ సాంగ్ తో ఎలా అలరిస్తుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'కేజీఎఫ్' తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో 'సలార్'పై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.