English | Telugu
మరో తమిళ్ స్టార్ తో దిల్ రాజు మూవీ!
Updated : Jan 3, 2023
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు చూపు తమిళ్ హీరోలపై పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'వారిసు'(వారసుడు) చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే మరో తమిళ్ స్టార్ ధనుష్ తో సినిమా చేయడానికి దిల్ రాజు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ధనుష్.. ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న 'సార్' మూవీ ఫిబ్రవరిలో విడుదల కానుంది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇక ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లోనూ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి 'శ్రీకారం' ఫేమ్ కిషోర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది.
మరోవైపు రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకుడు. ఇలా వరుసగా తమిళ హీరోలు, దర్శకులతో దిల్ రాజు సినిమాలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.