Read more!

English | Telugu

అతను నాకు అన్నయ్యతో సమానం - తమన్నా

 


పాపం తమన్నా... తెలుగులో సినిమాలు చేసినన్నీ రోజులు ప్రశాంతంగా వుంది. రెండు సినిమాలు హిందీలో చేసే సరికి తమన్నా చుట్టు నానా తలనొప్పులు వచ్చి చేరుతున్నాయి. అతను నాకు అన్నయ్య లాంటి వాడు అని నెత్తి, నోరు కొట్టుకుని  చెప్తున్నా ఏవో సంబంధాలు అంటగట్టేస్తున్నారు బాలీవుడ్‌లో.


లేటెస్టుగా హిందీలో ‘హమ్‌షకల్స్' చిత్రంలో తమన్నా నటించింది. ఆ సినిమా ప్రమోషన్ కోసం ఆ సినిమా యూనిట్ అంతా రకరకాల షోలలో పాల్గొంటున్నారు. వారితో తమన్నా కూడా కలిసి ప్రమోట్ చేస్తోంది. ఇదలా వుండగా, ఆ చిత్ర డైరెక్టర్ సాజిద్ ఖాన్ కి,  తమన్నాకి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందంటూ చాలా కాలంగా పుకార్లు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు తమన్నా వాటిని ఖండిస్తునే వుంది. చివరకు ఆయనకు నేను రాఖీ కట్టాను బాబు అని చెబుతున్నా ఈ వార్తలు ఆగటం లేదు.


ఈ సినిమా షూటింగ్ నుంచి, ప్రమోషన్ వరకూ అన్ని చోట్ల తమన్నాను సాజిద్ బాగా సపోర్ట్ చేస్తున్నాడని, ఈ సినిమాలో వున్న మిగతా ఇద్దరు హీరోయిన్ల కంటే తమన్నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని కథనాలు మొదలయ్యాయి. ‘హమ్‌షకల్స్' చిత్రానికి ముందు తమన్నా నటించిన హిందీ చిత్రం హిమ్మత్ వాలా. ఈ రెండు చిత్రాలకు సాజిద్ ఖానే దర్శకుడు కావడం ఈ పుకార్లకు మరింత ఊతం ఇస్తోంది. ఏమైనా యాక్టర్ ని డైరెక్టర్ సపోర్ట్ చేస్తే ఆ సంబంధమేనా, అని వాపోతోందట తమన్నా..