English | Telugu

తమన్నాకు బాలీవుడ్ చెల్లెలు

 

బాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న కరీనా కపూర్ కు కరిష్మా లాంటి అక్క దొరికిందట. ఆ అక్క మరెవరో కాదు.. హీరోయిన్ తమన్నా. అయితే అసలు విషయం ఏమిటంటే... తమన్నా ప్రస్తుతం సైఫ్ ఆలీఖాన్ హీరోగా నటిస్తున్న "హమ్ షకల్స్" చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో అప్పుడప్పుడు కరీనా వస్తూ ఉండేదని, దాంతో కరీనా తమన్నాల మధ్య మంచి స్నేహం ఏర్పడిందట. దాంతో తమన్నాకు కరీనా గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చిందట. "నిన్ను చూస్తుంటే మా అక్క కరిష్మానే చూస్తున్నట్లుంది. నీలో ఆమె పోలికలు బాగా ఉన్నాయి" అంటూ కరీనా కాంప్లిమెంట్ ఇచ్చిందట.