English | Telugu

ఎన్టీఆర్ తోనే సుకుమార్ సినిమా?

ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తాడని గతంలో వార్తలొచ్చాయి. కానీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం సుకుమార్ ఓ డిఫరెంట్ సబ్జెక్టు రెడీ చేసి, ఎన్టీఆర్ చేత ఓకె చేయించుకున్నాడని తెలుస్తోంది. సుకుమార్ కు అవకాశం ఇవ్వాలని ఎన్టీఆర్ ఏనాడో అనుకున్నాడు. కానీ తీరా వన్ సినిమా డిజాస్టర్ అయ్యేసరికి సైలెంట్ అయ్యాడు. అయితే పూరి తరువాత ప్రస్తుతానికి ఎన్టీఆర్ చేతిలో ఏ సినిమా లేదు. అందుకే ఇప్పుడు సుకుమార్ కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. పూరి సినిమా పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళుతుందట.