English | Telugu
రవితేజతో రాశి ఖన్నా రొమాన్స్
Updated : Dec 13, 2014
సంపత్ నంది దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘బెంగాల్ టైగర్’ అనే చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. తమన్నా మొదటి హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో మరో అందాల రాశి సెకండ్ హీరోయిన్ గా చేరిపోయింది. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బబ్లీ హీరోయిన్ రాశి ఖన్నా ప్రస్తుతం వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ అమ్మడిని ‘బెంగాల్ టైగర్’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. చిన్న సినిమాలతో భారీ క్రేజును సంపాదించుకున్న రాశిఖన్నా... ఇపుడు ఏకంగా మాస్ మహరాజ్ తో నటించే అవకాశం దక్కడంతో తెగ సంబరపడిపోతుంది. రవితేజ ప్రస్తుతం ‘కిక్ 2’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఈ సినిమా జనవరిలో పూర్తి కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ‘బెంగాల్ టైగర్’ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.