English | Telugu
దేవిశ్రీతో ఫాదర్ సెంటిమెంట్
Updated : Jan 4, 2016
'నాన్నకు ప్రేమతో' పనిలో బిజీగా ఉన్న సుకుమార్.. ఆ సినిమా విడుదలవగానే దేవిశ్రీతో మూవీ మొదలుపెట్టేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఈ ఏడాది ద్వితీయార్ధంలో దేవిశ్రీ-సుకుమార్ కాంబినేషన్లో సినిమా మొదలయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. దేవితో ఓ ప్రేమకథ తీయబోతున్నామని దిల్ రాజు చెప్పినప్పటికీ... సుక్కు మాత్రం వేరే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
దేవిపై ప్రేమకథ అంత బాగుండదేమో అని సుకుమార్ అభిప్రాయపడుతున్నాడట. మ్యూజిక్ బేస్డ్ సబ్జెక్ట్ తో ఫాదర్ సెంటిమెంట్ ని టచ్ చేస్తూ స్టొరీ తయారు చేయబోతున్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు పనులు కూడా జరుగుతున్నాయట. సుకుమార్ టీమ్ ఈ కథకు సంబంధించిన వర్క్ మొత్తం పూర్తి చేసే పనిలో వున్నారట. 'నాన్నకు ప్రేమతో' రిలీజ్ తరువాత కొంచెం బ్రేక్ తీసుకొని.. ఈ సినిమాపై వర్క్ చేస్తాడట సుక్కు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు మీడియాకి రిలీజ్ చేయబోతున్నారట.