English | Telugu

రామ్‌చ‌ర‌ణ్‌, ఆలియా భ‌ట్‌పై ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌?

య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న 'ఆర్ఆర్ఆర్' మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ దాదాపు పూర్తికావ‌చ్చాయి. ఇప్ప‌టికే సెన్సార్ బోర్డు ద‌గ్గ‌ర ఈ సినిమా ఉంది. మూడు గంట‌ల నిడివితో ఈ మూవీ ఉంటుంద‌ని స‌మాచారం. జ‌న‌వ‌రి 7న సినిమా విడుద‌ల‌వుతుండ‌గా, దానికి ఐదు వారాల ముందుగానే ట్రైల‌ర్‌ను రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌ను తియ్యాల‌ని రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్న‌ట్లు టాలీవుడ్‌లో వినిపిస్తోంది. అయితే అంద‌రూ ఊహించుకునేట్లు ఆ సాంగ్‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ మీద కాకుండా, చ‌ర‌ణ్‌-అలియా మీద తీయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

మూవీలో రామ‌రాజు, సీత మ‌ధ్య భావోద్వేగ‌పూరిత‌మైన ప్రేమ కోణం ఉంది. అందుక‌ని ఆ ఇద్ద‌రిపై ఒక ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ తీస్తే హిందీ వెర్ష‌న్‌కు బాగా ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని రాజ‌మౌళి భావిస్తున్నాడు. రాజ‌మౌళి కేవ‌లం ఒక డైరెక్ట‌ర్ మాత్ర‌మే కాదు, త‌న సినిమాను ఎలా ప్ర‌మోట్ చేయాలో, ఆడియెన్స్‌లో దానిపై హైప్‌ను ఎలా క్రియేట్ చేయాలో నిరంత‌రం ఆలోచించే బిజినెస్‌మ్యాన్ కూడా. డిసెంబ‌ర్ 3న ట్రైల‌ర్ రిలీజ‌య్యాక ఈ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌ను ఆయ‌న పిక్చ‌రైజ్ చేయొచ్చ‌ని అంటున్నారు.

అత్యంత భారీ బ‌డ్జెట్‌తో త‌యార‌వుతున్న సినిమా కాబ‌ట్టి, బ‌య్య‌ర్ల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చిపెట్టే ఏ ఒక్క అంశాన్నీ రాజ‌మౌళి వ‌దల‌డు. ఇప్పుడు ప‌రిస్థితులు సాధార‌ణంగా లేవు. కొవిడ్ 19 కార‌ణంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎక్కువ‌గా థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. అందుకే మ‌రింత దూకుడుగా ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌ను ప్లాన్ చేస్తున్నాడు రాజ‌మౌళి.