English | Telugu

`లైగ‌ర్`లో న‌ట‌సింహం?

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ టైటిల్ రోల్ లో డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ రూపొందిస్తున్న చిత్రం `లైగ‌ర్`. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో విజ‌య్ బాక్స‌ర్ గా క‌నిపించ‌నున్నారు. లెజెండ‌రీ బాక్స‌ర్ మైక్ టైస‌న్ ఓ ముఖ్య పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న ఈ చిత్రంలో విజ‌య్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అన‌న్యా పాండే న‌టిస్తుండ‌గా.. ర‌మ్య‌కృష్ణ‌, రోనిత్ రాయ్, మ‌క‌రంద్ దేశ్ పాండే కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ అతిథి పాత్ర‌లో మెర‌వ‌నున్నార‌ట‌. ఓ పాట‌లో కొద్ది సెకండ్ల పాటు త‌న ప్రెజెన్స్ ఉంటుంద‌ని టాక్. గ‌తంలో పూరి ద‌ర్శ‌క‌త్వంలో `పైసా వ‌సూల్` అనే చిత్రం చేశారు బాల‌య్య‌. ఆ చిత్రం నుంచే ఈ ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింది. ఆ కారణంగానే.. ఈ స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్ కి బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని బ‌జ్. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

కాగా, బాల‌య్య తాజా చిత్రం `అఖండ‌` బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో థియేట‌ర్స్ లో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. త్వ‌ర‌లో గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాని ప‌ట్టాలెక్కించ‌నున్నారు బాల‌కృష్ణ‌. అలాగే అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లోనూ ఓ మూవీ చేయ‌బోతున్నారు.