English | Telugu

సిద్ధార్థ, దీపికల మధ్యనున్నది స్నేహమేనా...!

సిద్ధార్థ, దీపికల మధ్యనున్నది స్నేహమేనా...! అని ఫిలిం నగర్ వర్గాలు గుస గుసలాడుకుంటున్నాయి. ఇదేంటయ్యా మొన్నే కదా సిద్ధార్థ, శృతి హాసన్ సహజీవనం సాగిస్తున్నారని అన్నావు... మళ్ళీ అప్పుడే సిద్ధార్థ దీపికను పటాయించాడా...మరీ వింతకాకపోతేనూ అనుకోకండి. ఎందుకంటే ఈ సిద్ధార్థ వేరు...ఆ సిద్ధార్థ వేరు. విషయమేమిటంటే శృతిహాసన్ తో కలిసి సహజీవనం చేస్తూంది హీరో సిద్ధార్థ. దీపిక పడుకునేతో సరసాలాడుతూంది బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా అన్నమాట.

అదీ సంగతి. ఆ మధ్య సిద్ధార్థ మాల్యాని దీపికతో నీ పరిచయానికి ఏం పేరు పెడతావు అని మీడియా అడిగితే "అబ్బే మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే"నని సమాధానమిచ్చాడు. కానీ వాళ్ళిద్దరి వరస చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య స్నేహం కంటే మించింది మరేదో ఉందని అర్థమవుతూంది. అందుకు తగ్గ ఆధారాలు కూడా మీడియాకు పుష్కలంగా లభిస్తున్నాయి. అయినా మా ఇద్దరి మధ్యా ఉన్నది స్నేహం మాత్రమేనంటే మనమేం చేయలేం...ఏమంటారు...?


 Video courtesy: Times Now