English | Telugu

మ‌హేశ్‌తో మ‌రోసారి శ్రుతి?

చిన్న బ్రేక్‌ తర్వాత వరుస సినిమాలు అంగీకరిస్తున్నారు శ్రుతి హాస‌న్‌. రవితేజతో ‘క్రాక్‌’ సినిమా పూర్తి చేసిన ఆమె, 'వ‌కీల్ సాబ్‌'లో ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఆయ‌న‌తో ఇది ఆమెకు మూడో సినిమా. ఇదివ‌ర‌కు 'గ‌బ్బ‌ర్ సింగ్‌', 'కాట‌మ‌రాయుడు' సినిమాల్లో ప‌వ‌న్‌తో ఆమె న‌టించారు. ఇపుడు మరో పెద్ద సినిమాలో కూడా కనిపించబోతున్నారని సమాచారం. 'స‌ర్కారు వారి పాట‌' తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్‌ పేరుని పరిశీలిస్తున్నారట దర్శకుడు వంశీ పైడిపల్లి.

గతంలో ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేశ్‌బాబు, శ్రుతి జోడీగా నటించిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘ఎవడు’ సినిమాలోనూ శ్రుతి హాస‌నే హీరోయిన్‌. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో మహేశ్, శ్రుతి రెండోసారి జోడీ కడతారా? వేచి చూడాలి.