English | Telugu

'ఛ‌త్ర‌ప‌తి' రీమేక్‌లో జాన్వీ క‌పూర్?

తెలుగునాట సంచ‌ల‌న విజ‌యం సాధించిన 'ఛ‌త్ర‌ప‌తి' చిత్రం.. హిందీలో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పోషించిన‌ పాత్ర‌లో టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ న‌టించ‌నున్నాడు. సాయిశ్రీ‌నివాస్ కి హిందీలో ఇదే తొలి చిత్రం కావ‌డం విశేషం. అంతేకాదు.. ఇదే సినిమాతో అగ్ర ద‌ర్శ‌కుడు వి. వి. వినాయ‌క్ బాలీవుడ్ లో తొలిసారి మెగాఫోన్ ప‌డుతున్నారు. ఫిబ్ర‌వ‌రి ద్వితీయార్ధం నుంచి 'ఛ‌త్ర‌ప‌తి' రీమేక్ కి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. ముంబై (ఫోర్ట్), రామోజీ ఫిల్మ్ సిటీ, ఢాకా వంటి ప్రాంతాల్లో ఈ సినిమా తాలూకు చిత్రీక‌ర‌ణ సాగుతుంద‌ట‌.

ఇదిలా ఉంటే.. ఒరిజిన‌ల్ వెర్ష‌న్ కోసం అందాల తార శ్రియా స‌ర‌న్ పోషించిన నాయిక పాత్ర‌లో ఎవ‌రు న‌టించ‌బోతున్నార‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. సారా అలీ ఖాన్, కియారా అద్వాని.. ఇలా ప‌లువురు బాలీవుడ్ బ్యూటీస్ పేర్లు వెలుగులోకి వ‌చ్చాయి. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి త‌న‌య జాన్వీ క‌పూర్.. ఈ రీమేక్ లో నాయిక‌గా న‌టించే అవ‌కాశ‌ముందట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.