English | Telugu
#MEGA 154.. చిరుతో శ్రుతి రొమాన్స్!
Updated : Oct 30, 2021
`క్రాక్`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన చెన్నైపొన్ను శ్రుతి హాసన్.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా `సలార్`లో నటిస్తోంది. అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ - `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రానున్న క్రేజీ ప్రాజెక్ట్ లోనూ శ్రుతి నాయికగా ఎంపికైందని సమాచారం. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవికి జంటగానూ మిస్ హాసన్ ఎంపికైందని బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. బాబీ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఓ మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. `#MEGA 154` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో చిరు సరసన శ్రుతి హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని వినికిడి. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ఇప్పటికే మెగా కాంపౌండ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి అగ్ర కథానాయకులతో జతకట్టింది శ్రుతి. పవన్ తో `గబ్బర్ సింగ్`, `వకీల్ సాబ్`.. చరణ్ తో `ఎవడు`.. బన్నీతో `రేసు గుర్రం` వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ శ్రుతి ఖాతాలో ఉన్నాయి. మెగాస్టార్ తోనూ ఆ విజయ పరంపరని కొనసాగిస్తుందేమో చూడాలి.