English | Telugu
క్రిస్మస్ బరిలో `అఖండ`?
Updated : Oct 29, 2021
`సింహా`(2010), `లెజెండ్` (2014) వంటి సెన్సేషనల్ హిట్స్ తరువాత నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం `అఖండ`. ఇందులో అఘోరాగా, ప్రభుత్వ అధికారిగా రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు బాలకృష్ణ. అతనికి జోడీగా ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపించనుండగా.. జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. విడుదలకు సిద్ధమైంది.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ సినిమాని రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోందట. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా, ఇదే తేదిన నేచురల్ స్టార్ నాని నటించిన పిరియడ్ డ్రామా `శ్యామ్ సింగ రాయ్` విడుదల కాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. మరి.. బాలయ్య రాకతో నాని చిత్రం వాయిదా పడుతుందేమో చూడాలి. మరోవైపు.. డిసెంబర్ 17న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ `పుష్ప - ద రైజ్` విడుదలకు సిద్ధమైంది. మొత్తానికి.. 2021 క్రిస్మస్ సీజన్ ఆసక్తికరమైన చిత్రాలకు వేదిక కానుందన్నమాట.