English | Telugu

అంతా తూచ్‌.. SSMB 29 షూట్ స్టార్ట్ కాలేదు!

అంతా తూచ్‌.. SSMB 29 షూట్ స్టార్ట్ కాలేదు!

 

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో షూట్ జరుపుకుంది. ప్రస్తుతం ఒడిశాలో షూట్ జరుగుతోంది. అయితే షూటింగ్ లొకేషన్ నుంచి కొన్ని ఫొటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. ముఖ్యంగా ఒక వీడియోలో మహేష్ నటించిన సీక్వెన్స్ లీక్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. (SSRMB)

 

రాజమౌళి ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటారు. కనీసం హీరో లుక్ కూడా రివీల్ కాకుండా.. ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు. అలాంటిది రాజమౌళి కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం నుంచి.. హీరో సీక్వెన్స్ వీడియో లీక్ అవ్వడం అందరినీ సర్ ప్రైజ్ చేసింది. అయితే 'SSMB 29' విషయంలో అంతకుమించిన బిగ్ సర్ ప్రైజ్ ఉందని తెలుస్తోంది. ఇంతవరకు అసలు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదని ఒక టాక్ నడుస్తోంది.

 

ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట ప్రకటం, 'SSMB 29' రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదట. ప్రస్తుతం జరుగుతున్నది టెస్ట్ షూట్ లాంటిదట. ఇది దాదాపు మూడు వారాల పాటు జరగనుందని వినికిడి. రాజమౌళి ఇలా టెస్ట్ షూట్ ఏర్పాటు చేయడం వెనక బలమైన కారణం ఉందని అంటున్నారు. మహేష్ తో రాజమౌళికి ఇది మొదటి సినిమా. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ కి.. ఈ టెస్ట్ షూట్ హెల్ప్ అవుతుంది. అలాగే అవుట్ పుట్ ఎలా వస్తుందో చూసుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా, ఈ టెస్ట్ షూట్ కంటెంట్ తో మూవీ అనౌన్స్ మెంట్ టీజర్ ను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట.

 

రాజమౌళి తన గత చిత్రం 'ఆర్ఆర్ఆర్' టైంలో కూడా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలను పరిచయం చేస్తూ.. ప్రత్యేక టీజర్లను విడుదల చేశారు. ఆ టీజర్స్ కోసం స్పెషల్ షూట్ చేశారు. సినిమాలో లేని మెజారిటీ షాట్స్ తో.. ఆ టీజర్స్ ను రూపొందించారు. 'SSMB 29' విషయంలోనూ అదే ఫాలో అవుతున్నారట రాజమౌళి. మూవీ కాన్సెప్ట్, మహేష్ పాత్ర ఎలా ఉంటాయో తెలిపేలా ఈ అనౌన్స్ మెంట్ టీజర్ ను ప్లాన్ చేస్తున్నారట. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ఈ టీజర్ విడుదలయ్యే అవకాశముంది అంటున్నారు. ఆ తర్వాత ఫారెన్ లో 'SSMB 29' రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని చెబుతున్నారు.