English | Telugu
తమన్నా డేట్స్ కావాలంటే సీక్రెట్ ఇదిగో..
Updated : Jul 9, 2014
ఓ దర్శకుడు ఓ ఆడియో ఫంక్షన్లో హీరోల డేట్లు ఇమ్మిడియేట్ గా కావాలంటే ఏం చేయాలో చెప్పాడు. కానీ బిజీ హీరోయిన్ల డేట్లు కావాలంటే ఏం చెయ్యాలో ఎవరూ చెప్పలేదు. కానీ తమన్నా డేట్స్ కావాలంటే ఏం చెయ్యాలో మాత్రం తెలిసిపోయింది. సింపుల్ గా కుక్కలతో ఎక్కువ సీన్లుండే కథ రెడీ చేసుకుని ఆమె దగ్గరకు వెళితే చాలు. బిజీ షెడ్యూల్ అయినా డేట్లు ఇచ్చేస్తుంది. కావాలంటే కాస్త రెమ్యునరేషను కూడా తగ్గించుకోవచ్చు.
ఇంతకీ అసలు కథేంటంటే, తమన్నాకు చిన్నప్పటి నుంచి కుక్కలు చాలా ప్రేమట. కానీ వాళ్లమ్మకు మాత్రం కుక్కలు అంటే అసలు గిట్టదట. అందుకే ఇప్పటివరకూ తమన్నా ఒక్క కుక్కపిల్లను కూడా పెంచుకోలేక పోయిందట. కానీ అక్షయ్ కుమార్ తో తమన్నా కలిసి నటిస్తున్న చిత్రం 'ఇట్స్ ఎంటర్‌టెయిన్‌మెంట్'. ఈ హిందీ చిత్రంలో కీలకమైన 'ఎంటర్‌టెయిన్‌మెంట్' అనే పేరు గల పాత్ర ఒక కుక్కది.
ఇలా ఈ సినిమా కోసం డాగ్ తో ఎక్కువ సమయం గడపడంతో తమన్నాకు వాటి మీద మరింత ప్రేమ పెరిగిపోయిందట. అందుకే ఈ మధ్యే ఒక కుక్కను తెచ్చుకుని దానికి పెబెల్స్ అని పేరుకూడా పెట్టుకుంది తమన్నా. కుక్క ప్రేమలో మునిగి తేలుతున్న తమన్నాను నెక్స్ట్ సినిమా కోసం ఒప్పించాలంటే కుక్క పాత్రకు ప్రాధాన్యత వున్న కథ తీసుకెల్తే సరిపోతుందనిపిస్తోంది. ఈ సీక్రెట్ ని వుపయోగించుకొని దర్శకులు తమ అదృష్టం పరీక్షించుకోవచ్చు..