English | Telugu

కొబ్బరిమట్టలో సంపూ ఆండ్రాయిడ్

 

బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు నటించిన "హృదయ కాలేయం" ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే సంపూ మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. "కొబ్బరిమట్ట" అనే పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో సంపూ మూడు విభిన్న పాత్రలు చేస్తున్నాడు. గతంలో రజినీకాంత్, మోహన్ బాబు కలిసి నటించిన "పెదరాయుడు" చిత్రంలోని పాత్రలకు కొనసాగింపుగా ఈ చిత్రం ఉంటుందని తెలిసింది. ఇందులో సంపూ.. పాపారాయుడు(రజినీకాంత్), పెదరాయుడు(మోహన్ బాబు) పాత్రలలో కనిపించడమే కాకుండా ఈతరానికి చెందిన ఆండ్రాయిడ్ అనే మూడు పాత్రలలో నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వస్తుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో త్వరలోనే తెలియనుంది.