English | Telugu

"నగ్నంగా నటిస్తాను" సమీరా రెడ్డి

పూర్వం ఒకప్పటి సినిమాల్లో హీరోయిన్ జాకెట్ లోపల బ్రా వేసిందన్న ఆనవాలు లీలగా కనిపించినందుకే నానా గొడవ చేశారు ఆ నాటి పెద్దలు. మామూలుగా అయితే ఆ రోజుల్లో అదే అశ్లీలం.ఇప్పుడా పెద్దలంతా బ్రతికి ఉంటే నేటి మన హీరోయిన్ల డ్రెస్సులూ, బికినీలు,టాప్ లెస్ గా నటించటం చూస్తే బహుశా ఆత్మహత్యలు చేసుకుంటారేమో.ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే మన హిందీ హీరోయిన్లు, రాణీ ముఖర్జీ, విద్యాబాలన్, మందిరా బేడీలు ఇప్పటికే టాప్ లెస్ గా కనిపించి ప్రేక్షకులను ఆనందపరిచారు.ప్రస్తుతం ఒక హీరోయిన్ మరో అడుగు ముందుకు వేసి "నేను నగ్నంగా నటించటానికి రెడీ" అంటోంది.ఇక్కడో క్లాజ్ కూడా ఉందండోయ్ "కళాత్మక చిత్రంలో, పాత్ర డిమాండ్ చేస్తేనే నేను నగ్నంగా నటిస్తాను" అని అంటోంది.ఆమె మరెవరో కాదు "జై చిరంజీవ","అశోక్","నరసింహుడు"చిత్రాల్లో నటించిన సమీరా రెడ్డి.