English | Telugu

మరోసారి పవన్ కు జోడీగా సమంత!!

ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా పెళ్లి తరువాత సినిమాల పరంగా జోరు తగ్గిపోతుంది. అయితే సమంత అక్కినేని మాత్రం పెళ్లి తరువాత విభిన్న సినిమాలు, విభిన్న చిత్రాలతో జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. రీసెంట్ గా 'ది ఫ్యామిలీ మ్యాన్-2' వెబ్ సిరీస్ తో నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకుంది సమంత. ఆ సిరీస్ లో ఆమె నటనకి ప్రశంసల వర్షం కురుస్తోంది. దీంతో బడా నిర్మాణ సంస్థలు, బడా స్టార్ల దృష్టి సమంతపై పడింది. మూవీస్, వెబ్ సిరీస్ అనే తేడా లేకుండా వరుస క్రేజీ ఆఫర్స్ ఆమె తలుపు తడుతున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. గతంలో పవన్- సమంత కాంబినేషన్లో వచ్చిన 'అత్తారింటికి దారేది' మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మరి ఈ పెయిర్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తుందేమో చూడాలి.

సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శాకుంతలం' సినిమాలో నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా.. ఇప్పటికే దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.