English | Telugu
పుష్ప మూవీలో మెగాస్టార్ సాంగ్ రీమిక్స్!!
Updated : Jun 9, 2021
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ 'పుష్ప' మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ.. రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇప్పటికే ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ పేరుతో విడుదల చేసిన టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీపై ఫ్యాన్స్ కి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మూవీలో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కోసం సుకుమార్ ఓ బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడని టాక్ వినిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు బన్నీ-సుకుమార్ కలిసి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడట. పుష్ప మూవీలో మెగాస్టార్ సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఆ సాంగ్ ఏంటనేది మాత్రం ఇంకా సమాచారం లేదు. అయితే బన్నీ మూవీలో మెగాస్టార్ సాంగ్ వార్త నిజమైతే మాత్రం మెగా ఫ్యాన్స్ కి పండగ అనే చెప్పాలి. మెగాస్టార్ సూపర్ హిట్ సాంగ్ కు బన్నీ కాలు కదిపితే ఆ దృశ్యం చూడటానికి ఫ్యాన్స్ కి రెండు కళ్ళు చాలవనే చెప్పాలి.
మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న పుష్ప చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడుగా నటిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం మొదటి భాగం 2021 ఆగస్టు 13న విడుదల కానుంది.