English | Telugu
ప్రభాస్ తో రాశీ ఖన్నా?
Updated : Jun 11, 2021
స్టన్నింగ్ బ్యూటీ రాశీ ఖన్నా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఏడేళ్ళవుతోంది. ఈ ప్రయాణంలో కేవలం ఇద్దరు అగ్ర కథానాయకులతో మాత్రమే మిస్ ఖన్నా జట్టుకట్టింది. `బెంగాల్ టైగర్`(2015), `టచ్ చేసి చూడు`(2018) చిత్రాల్లో మాస్ మహారాజా రవితేజకి జోడీగా నటించిన రాశి.. `జై లవ కుశ`(2017)లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన కనువిందు చేసింది.
కట్ చేస్తే.. మూడేళ్ళ తరువాత మరో స్టార్ హీరోకి జంటగా నటించే అవకాశం దక్కించుకుందట రాశి. అది కూడా ఓ పాన్ ఇండియా మూవీ కోసం. ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ప్రభాస్ కి జతగా దీపికా పదుకొణె నటించనుంది. కాగా, ఈ సినిమాలో రెండో నాయికకి కూడా స్థానముందట. ఆ పాత్రలో రాశిని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారట నాగ్ అశ్విన్. రాశి కూడా ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఉందని సమాచారం. త్వరలోనే ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబో మూవీలో రాశి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి.. ఈ సినిమాతో రాశి స్థాయి పెరుగుతుందేమో చూడాలి.