English | Telugu
ఆ హీరోతో సమంత సరసాలు!
Updated : Jan 2, 2016
సమంత పేరు ఇప్పుడు మార్మోగుతోంది! రకరకాల ఎఫైర్లలో ఆమె పేరు బాగా నానుతోంది. కొంతకాలం సిద్దార్థ్ తో రొమాన్స్ చేసింది సమంత. ఆ వ్యవహారం పెళ్లి వరకూ వెళ్లింది. తరవాత ఇద్దరికీ చెడింది. బైబై చెప్పుకొని విడిపోయారు.
కొంతకాలానికి టాలీవుడ్‌లో టాలెంటెడ్ దర్శకుడిగాపేరు తెచ్చుకొన్న ఒకాయనతో సన్నిహితంగా మెలిగింది. ఆయనతో వరుసగా సినిమాలు చేసింది. ఇద్దరూ కలిసి ఓ స్టార్ హోటల్ లో కాపురం పెట్టేశారని కూడా గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు దర్శకుడికి కూడా టాటా చెప్పేసి - ఓ పెళ్లి కాని యువ హీరోతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఆ హీరో కూడా ఉన్నత నట కుటుంబం నుంచి వారసుడిగా వచ్చినవాడే. ఇద్దరూ కలసి ఈమధ్య గోవా వెళ్లారట. అక్కడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చేసుకొన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం హీరో ఇంట్లో తెలిసిపోయిందట. ఇంట్లో ఇప్పుడు పెద్ద రాద్దాంతం జరుగుతోందని, ఆ హీరోకి పెళ్లి చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది. మరి ఈ లవ్ ఎఫైర్ వ్యవహారం ఎందాక వెళ్తుందో చూడాలి.