English | Telugu

డిక్టేటర్ పై సీరియస్ గా బాలయ్య..!!

తొలిసారి నందమూరి హీరొల నడుమ ముఖాముఖి పోటీ జరగబోతోంది. ఇద్దరూ హీరోలు తమ సినిమాలతో హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నారు. అందుకని తమ సినిమాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు సమాచారం. ఎప్పుడూ తన సినిమాలలో డైరక్టర్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చే బాలయ్య.. డిక్టేటర్ విషయంలో చాలా కేర్ గా ప్రతీది దగ్గరుండి చూసుకుంటున్నాడట.

ప్రస్తుతం డిక్టేటర్ పబ్లిసిటీ.. థియేటర్ల సమస్యలు అన్ని తెలుసుకోని వెంటనే పరిష్కరిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. అలాగే పబ్లిసిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడవద్దని నిర్మాతలకు ముందుగానే చెప్పాడట. ఇందులో భాగంగానే తన ఇంటర్వూ ప్లాన్ చేయించి విడుదల చేయించాడట. ఇవన్నీ చూస్తుంటే ..డిక్టేటర్ విషయంలో బాలయ్య ఎంత సీరియస్ గా వున్నాడో అర్ధమవుతోంది.

ఒక పక్కా ఎన్టీఆర్, సుకుమార్ లాంటి డైరక్టర్ , అది కూడా కంప్లీట్ గా ఫారిన్ లోకేషన్ లో షూట్ చేసిన సినిమా నాన్నకు ప్రేమతో. మరోవైపు సంక్రాంతి స్పెషల్ గా తయారుచేసిన అక్కినేని నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా. వీరి మధ్యలో భారీ హిట్ కోసం బాలయ్య పక్క ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు. మరి బాలయ్య అనుకున్న హిట్ సాధిస్తాడా? లేదా అనేది వేచి చూడాల్సిందే.