English | Telugu

బాబాయి అబ్బాయిల 'పోస్టర్' వార్

బాబాయి అబ్బాయిల సంక్రాంతి వార్ కొంచెం గట్టిగానే సాగుతున్నట్లు అర్థమవుతోంది.మొన్న నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్ సందర్భంగా నెలకొన్న పరిణామాలు..ఇప్పుడు లేటెస్ట్ గా నెలకొంటున్న కొన్ని సంఘటనలు వీటికి గట్టిగా బలాన్ని చేకూరుస్తున్నాయి. నందమూరి కుటుంబానికి ఏకైక నట వారసుడు బాలయ్య అంటూ ‘డిక్టేటర్’ పోస్టర్లు కూడా దర్శనమిస్తుండటంతో అభిమానుల మధ్య విబేధాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఐతే ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే డిక్టేటర్ నాన్నకు ప్రేమతో సినిమాలు రిలీజైనపుడు ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో అని నందమూరి అభిమానుల్లో ఆందోళన చెందుతున్నారు.