English | Telugu

స‌మంత‌కు ఇది రెండో పెళ్లా??

స‌మంత గురించి రోజుకో హాట్ టాపిక్ బ‌య‌ట‌కు వ‌స్తోంది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ స‌మంత ప్రేమ‌లో ప‌డింద‌న్న వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఆ త‌ర‌వాత ఆ ప్రియుడు నాగ‌చైత‌న్య అని తేలిపోయింది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకొంటారా, లేదా? అనే విష‌యంలోనూ భ‌యంక‌ర‌మైన చ‌ర్చ‌లు న‌డిచాయి. చివ‌రికి నాగార్జున కూడా నోరు తెర‌చి.. స‌మంత కోడ‌ల‌ని చెప్ప‌క‌నే చెప్పేశాడు. ఇప్పుడు పూజ‌లు, పునస్కారాల వ‌ర‌కూ వెళ్లిపోయింది. రేపో మాపో పెళ్లి డేట్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తోంది. ఈలోగా మ‌రో గాసిప్ షికారు చేస్తోంది. స‌మంత‌కు ఇది వ‌ర‌కే పెళ్ల‌యిపోయింద‌ని, చైతూతో ఇది రెండో పెళ్ల‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

స‌మంత ఇది వ‌ర‌కు సిద్దార్థ్ తో చ‌ట్టాప‌ట్టాలేసుకొని తిరిగిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి ప్రేమ వ్య‌వ‌హారం కూడా మీడియాకు ఎక్కేసింది. అయితే ఇద్ద‌రూ ఎందుక‌నో విడిపోయారు. అయితే... సిద్దూ - స‌మంత‌ల పెళ్లి అప్ప‌ట్లో ర‌హ‌స్యంగా జ‌రిగింద‌ని, పెళ్లి చేసుకొన్న త‌ర‌వాతే.. అభిప్రాయ బేధాలొచ్చి విడిపోయార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో కొత్త మాట‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ సంగ‌తుల‌న్నీ చైతూకి తెలుస‌ని, అయినా స‌రే.. స‌మంత‌ని చేసుకొందామ‌ని ఫిక్స‌య్యాడ‌ని చెబుతున్నారు. స‌మంత కూడా పాత విష‌యాల‌న్నీ మ‌ర్చిపోయి చైతూతో కొత్త లైఫ్ మొద‌లెట్టాల‌ని భావిస్తోంది. అందుకేగ‌త జ్ఞాప‌కాల్ని ఎప్పుడో మ‌ర్చిపోయింద‌ని, ప్ర‌స్తుతం చైతూతో పెళ్లి కోసం ఎదురుచూస్తోంద‌ని చెప్పుకొంటున్నారు.