English | Telugu

ఐటెమ్ గీతాల‌పై త‌మ‌న్నా హాట్ కామెంట్‌

అల్లుడు శీను కోసం త‌మ‌న్నా ఐటెమ్ గీతానికి ఒప్పుకొని చిత్రసీమ‌కు షాక్ ఇచ్చింది. ఓ కొత్త కుర్రాడితో స్టార్ హీరోయిన్ ఐటెమ్ గీత‌మేంటి? అని అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. స్పీడున్నోడు సినిమాకీ అదే ఫార్ములా కంటిన్యూ చేసింది. ఇప్పుడు జాగ్వార్ సినిమాకీ అంతే. ఒకొక్క పాట‌కూ త‌మ‌న్నా యాభై ల‌క్ష‌ల వ‌ర‌కూ వ‌సూలు చేసిందని చెప్పుకొన్నారు. సినిమా మొత్తం చేస్తే కోటి రూపాయ‌లు కూడా రావు. అదే నాలుగు రోజులు క‌ష్ట‌ప‌డితే అందులో స‌గం సంపాదించేయొచ్చు.

లాభ‌సాటి వ్యాపారం కాబ‌ట్టి త‌మ‌న్నా కూడా వ‌రుస‌బెట్టి ఐటెమ్ గీతాలు చేస్తోంది. అంతేకాదు.. ఐటెమ్ గీతాల్ని ఒప్పుకొనేది డ‌బ్బు కోస‌మే అంటూ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ``ఐటెమ్ పాట‌ల్ని ఎందుకు ఒప్పుకొంటున్నారు?`` అని అడిగితే... ''మీరు ఊహించేది నిజ‌మే. పారితోషికం కోస‌మే'' అంటూ షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చింది. ''డాన్సంటే నాకు ఇష్టం. డాన్స్ లో న‌న్ను నేను ప్రూవ్ చేసుకొనే ఏ సంద‌ర్భాన్నీ వ‌ద‌లుకోను. దాంతో పాటు మంచి పారితోషికం కూడా ఇస్తున్నారు ఇంకేం కావాలి'' అంటూ అస‌లు గుట్టు విప్పేసింది త‌మ‌న్నా. సో.. త‌మ‌న్నా ఇలాంటి పాట‌లు చేసేది కేవ‌లం డ‌బ్బుల కోస‌మే అన్న‌మాట‌. క్లారిటీ వ‌చ్చేసింది క‌దా.. ఇక రిలాక్స్ అయిపోండి.