Read more!

English | Telugu

ఎన్టీఆర్ పై నోరుపారేసుకున్న సమంత

 

టాలీవుడ్ లో సమంత ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువగా చేస్తుందన్న విషయం తెలుగు ఇండస్ట్రీ మొత్తం తెలిసిన విషయమే. ఈ అమ్మడు తన నోటి దురుసును తగ్గించుకోకపోగా.. రోజు రోజుకి ఎక్కువగా చేస్తుంది. మొన్న మహేష్ సినిమా పోస్టర్ విషయంలో పెద్ద దుమారమే రేగింది. తెలుగులోనే ఈ అమ్మడు ఇలా చేస్తుందా అని అనుకుంటే పొరపాటే. ఏ ఇండస్ట్రీలో నైనా ఈ అమ్మడు తన నోటికి పనిచేప్పాల్సిందే అని నిర్ణయించుకుంది. తమిళంలో సమంత ప్రస్తుతం "అంజాన్" అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా పోస్టర్ విషయంలో కూడా హీరో సూర్యపై చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాగే హీరోయిన్లపై కూడా ఈ అమ్మడు నోరు పారేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. సమంత ఈసారి ఎన్టీఆర్ ను టార్గెట్ చేసింది.

సమంత ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి "రభస" చిత్రంలో నటిస్తోంది. ఇందులో ప్రణీత మరో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ చిత్ర షూటింగ్ కొన్ని కారణాల వలన ఆలస్యం అవుతూ వస్తుంది. సమంతకు కోలీవుడ్ నుండి వరుస ఆఫర్లు చాలా వస్తున్నాయట. కానీ అవన్నీ చేయకపోవడానికి కారణం ఎన్టీఆర్ 'రభస' చిత్రమే కారణమని చెబుతుందట ఈ అమ్మడు. ఈ సినిమా కోసం నేను ఎక్కువ సమయం కేటాయించాను... కానీ ఎలాంటి ఫలితం లేదంటూ... 'రభస'పై పలు విమర్శలు చేస్తుందట. ఈ విషయం తెలిసిన సినీ వర్గాలు ..."ఇందులో నువ్వు మాత్రమే కాకుండా ఇంకా ప్రణీత కూడా హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఆమెకు లేని బాధ నీకెందుకు. నువ్వు ఒక్కదానివే ఎదో పెద్ద త్యాగం చేసినట్లు ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సమంత ఇలా ప్రతిసారి టాలీవుడ్ పై నోరు పారేసుకోవడానికి కారణం తన ప్రియుడు సిద్ధార్థ్ అని అందరు అంటున్నారు. ఎందుకంటే సిద్ధార్థ్ ని కూడా టాలీవుడ్ ఎప్పుడో బహిష్కరించింది. ఇప్పుడు టాలీవుడ్ లో సిద్ధార్థ్ కు అంత సీన్ లేదని తెలుస్తుంది. అందుకే ఇటీవలే ఓ సమావేశంలో సిద్ధార్థ్ కూడా టాలీవుడ్ పై పలు విమర్శలు చేసారు. అందుకే సమంత చేత కూడా సిద్ధార్థ్ ఇలా విమర్శలు చేయిస్తున్నాడని తెలుస్తుంది. ప్రియుడికి నచ్చని పని ఏది కూడా చేయను అనే విధంగా సమంత కూడా త్వరలోనే కోలీవుడ్ కి చెక్కేయ్యడానికి సిద్ధమవుతుంది.

మరి ఇప్పటికే సమంత విషయంలో గరం గరంగా ఉన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ... ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే ఈ అమ్మడిని టాలీవుడ్ సినిమాల్లో తీసుకోవద్దని భావిస్తున్నారు. ఒకవేళ ఈ అమ్మడికి మరో రెండు సంవత్సరాల్లో టాలీవుడ్ కి వీడ్కోలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు బాగానే ఉన్నాయి. చూద్దాం.. మరి సమంత నోటి దురుసుకి 'రభస' యూనిట్ ఎలా స్పందిస్తారో.