English | Telugu
సమంత ప్రచారంకు కోటి రూపాయలు
Updated : Mar 29, 2014
సమంతను బాగా వాడుకోవడానికి నీరజ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇంతకీ ఈ నీరజ ఎవరని అనుకుంటున్నారా? సమంత ప్రతీ సినిమాలో, ఫంక్షన్ లలో అందంగా, కొత్త కొత్త ఫ్యాషన్ డ్రెస్సులతో హాట్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తను ఇంత అందంగా కనిపించడానికి కారణం డిజైనర్ కోన నీరజ మాత్రమే కారణమని సమంత చెబుతుంది. మరి తనను ఇంత గ్లామర్ గా చూపిస్తున్న నీరజ కోసం సమంత ప్రచారానికి రెడీ అయ్యింది.
ఇంతకీ ప్రచారం ఏమిటంటే.... నీరజ తండ్రి రఘుపతికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ లభించింది. దాంతో ఈ రాజకీయపార్టీ ప్రచారానికి నీరజ కాస్త గ్లామర్ అందించాలనే ఉద్దేశ్యంతో సమంతను రిక్వెస్ట్ చేసిందని, సమంత కూడా వెంటనే ఒప్పేసుకుందని తెలిసింది. అంతేకాదు ఈ ప్రచారం కేవలం ఒక్కరోజు మాత్రమే. ఈ ఒక్కరోజుకే కోటి రూపాయలను తీసుకున్నదని ఇప్పటివరకు అందరూ అనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వేడి కారణంగా మరింత అదనంగా సమంత వసూలు చేసిందని సమాచారం. మరి ఈ అమ్మడు ఈ ప్రచారంలో ఎలాంటి గ్లామర్ తో ఆకట్టుకుంటూ ఏమేం కబుర్లు చెబుతుందో చూడాలి.