English | Telugu

సల్మాన్ ఖాన్ న్యూ లవ్..

 


ఐశ్వర్య, కత్రీనా అంతకు ముందూ ఇంకొందరు.. మరిప్పుడు సల్మాన్ ఖాన్ జోరుగా ప్రేమించేస్తున్నది ఎవరా అని తేల్చుకోలేకపోతున్నారు సల్మాన్ అభిమానులు. దానికి జవాబు త్వరలో ఇవ్వబోతున్నాడు సల్మాన్. నేషనల్ టీవీ ఛానల్ ద్వారా తన ప్రేమను వ్యక్తం చేయబోతున్నాడట.
ఇంతకీ సల్మాన్ ప్రేమ చూరగొన్నది ఝలక్ ధిక్ లాజా -7 షోలో పాల్గొంటున్న ఫలక్. కామెడీ నైట్స్ విత్ కపిల్‌ సీరిస్ ద్వారా పాపులర్ అయిన ఫలక్ సల్మాన్ మనసు గెలుచుకుందంటూ ఆ ఛానల్ లో ఇప్పటికే ప్రోమోలు టెలికాస్ట్ అవుతున్నాయి. ఈద్ కి విడుదల అవుతున్న కిక్ సినిమా ప్రమోషన్ లో భాగంగా సల్మాన్ ఈ షోకి హాజరవుతున్నారు. ఆ సమయంలో సల్మాన్ కొత్త ప్రేమ ఎలా చిగురిస్తుందో, ఎంత వరకూ నిలుస్తుందో చూడాలి.