English | Telugu

ఇదీ ఫ్రెండ్‌షిప్‌ అంటే.. చరణ్‌ సినిమాలో సల్మాన్‌ఖాన్‌?

రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన వెంటనే సానా బుచ్చిబాబు డైరెక్షన్‌లో చేస్తున్న ఆర్‌సి16 సెట్స్‌కి వెళ్లిపోయారు చరణ్‌. మైసూర్‌లో తొలి షెడ్యూల్‌ స్టార్ట్‌ అయింది. ఈ షెడ్యూల్‌లో చరణ్‌ కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. అదేమిటంటే.. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్నాడనేదే ఆ వార్త. సల్మాన్‌ని ఈ సినిమాలో చూపించేందుకు యూనిట్‌ ప్రయత్నాలు చేస్తోంది. 

సల్మాన్‌ఖాన్‌తో రామ్‌చరణ్‌కి మంచి రిలేషన్‌ ఉంది. ఆ స్నేహంతోనే మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ నటించారు. ఇందులో నటించినందుకు సల్మాన్‌ రెమ్యునరేషన్‌ తీసుకోలేదని చిరంజీవి స్వయంగా తెలియజేశారు. అలాగే సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘కిసీకా భాయ్‌ కిసీకీ జాన్‌’ చిత్రంలోని ఓ పాటలో రామ్‌చరణ్‌తోపాటు వెంకటేష్‌ కూడా స్టెప్పులేశారు. ఆ ఫ్రెండ్‌షిప్‌తోనే ఇప్పుడు చరణ్‌ సినిమాలో సల్మాన్‌ఖాన్‌ నటించేందుకు ఒప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ కాంబోకి సంబంధించి సంక్రాంతి లోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్‌సి16 సినిమా కోసం ‘పెద్ది’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ సినిమాకి సంగీతాన్నందిస్తున్నారు. చరణ్‌ సినిమాకి రెహమాన్‌ మ్యూజిక్‌ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.