English | Telugu

'స‌లార్'లో గ్లోబ‌ల్ స్టార్ స్పెష‌ల్ సాంగ్?

'కేజీఎఫ్' కెప్టెన్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ 'స‌లార్'. కొద్దిరోజుల క్రిత‌మే ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. ప్ర‌స్తుతం గోదావ‌రిఖ‌ని ప‌రిస‌ర ప్రాంతాల్లో యాక్ష‌న్ సీక్వెన్స్ తాలూకు షూటింగ్ జ‌రుగుతోంద‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే.. ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో అందాల తార శ్రుతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా, ఇందులో ఓ ప్ర‌త్యేక గీతానికి స్థాన‌ముంద‌ని.. ఆ పాట‌లో గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రాని న‌ర్తింప‌జేసే దిశ‌గా ప్ర‌యత్నాలు జ‌రుగుతున్నాయ‌ని వినికిడి. ఈ క‌థ‌నాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే మ‌రికొంత కాలం వేచిచూడాల్సిందే.

'స‌లార్‌'ని హోంబ‌ళే ఫిల్మ్స్ సంస్థ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది. అక్టోబ‌ర్ క‌ల్లా చిత్రీక‌ర‌ణ పూర్తిచేసి... 2022 సంక్రాంతికి థియేట‌ర్స్ లో రిలీజ్ చేసే దిశ‌గా ప్ర‌ణాళిక జ‌రుగుతోంది. ఈలోగా 'రాధేశ్యామ్‌'తో అభిమానుల‌ను ప‌ల‌క‌రించేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్‌.