English | Telugu

రామ్ త్రిపాత్రాభిన‌యం?

ఇస్మార్ట్ శంక‌ర్ లో డ‌బుల్ దిమాక్ పోర‌గాడిగా మ‌స్త్ ఎంట‌ర్ టైన్ చేశారు ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్. క‌ట్ చేస్తే.. పొంగ‌ల్ కి వ‌చ్చిన త‌న నెక్స్ట్ పిక్చ‌ర్ రెడ్ లో ట్విన్ బ్ర‌ద‌ర్స్ గా ఏకంగా డ్యూయెల్ ధ‌మాకా ఇచ్చారు. రెండు సంద‌ర్భాల్లోనూ ఫ్యాన్స్ ని ఫిదా చేశారు రామ్.

ఈ నేప‌థ్యంలో.. క‌మింగ్ ప్రాజెక్ట్ కోసం ఎక్స్ ట్రా ఎంట‌ర్ టైన్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌‌ట ఈ టాలెంటెడ్ స్టార్. ఇందులో భాగంగానే.. త్రిపుల్ రోల్ (త్రిపాత్రాభిన‌యం)లో ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నార‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. త‌మిళ ద‌ర్శ‌కుడు ఆర్.టి. నేశ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ ఓ సినిమా చేయ‌బోతున్నట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో రామ్ మూడు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తార‌‌ట‌. అంతేకాదు.. మూడు పాత్ర‌ల కోసం మేకోవ‌ర్ ప‌రంగా వేరియేష‌న్స్ చూప‌బోతున్నట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే రామ్ త్రిపుల్ రోల్ కి సంబంధించి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

కాగా, ప్ర‌స్తుతం రామ్ శివ దీక్ష‌లో ఉన్నారు. దీక్ష పూర్త‌య్యాకే కొత్త చిత్రానికి సంబంధించి క‌బురు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని బ‌జ్.