English | Telugu

ప‌వ‌న్ కోసం సాయిప‌ల్ల‌వి రూ. 2 కోట్ల డిమాండ్?

ఇప్ప‌టి క‌థానాయిక‌ల్లో 'ఫిదా' పోరి సాయిప‌ల్ల‌వి తీరే వేరు. క‌థ, పాత్ర న‌చ్చితే త‌ప్ప సినిమాకి సంత‌కం చేయ‌రు. అందుకే.. త‌న తోటి నాయిక‌ల‌తో పోలిస్తే ప‌ల్ల‌వి సినిమాల సంఖ్య ప‌రిమితంగానే ఉంటుంది. అయితే, ఈ మ‌ధ్య సాయిప‌ల్ల‌వి కూడా రూట్ మార్చారు. నెంబ‌రాఫ్ మూవీస్ చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. అంతేకాదు.. పారితోషికం విష‌యంలోనూ త‌గ్గ‌డం లేదు. రీసెంట్ గా ఓ మ‌ల్టిస్టార‌ర్ కోసం ఏకంగా రూ. 2 కోట్లు డిమాండ్ చేశారట‌. సాయిప‌ల్ల‌వి క్రేజ్ దృష్ట్యా పాత్ర ప‌రిధి త‌క్కువే అయినా అంత మొత్తం ఇచ్చేందుకు నిర్మాత‌లు వెనుకాడ‌లేద‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ద‌గ్గుబాటి స్టార్ రానా కాంబినేష‌న్ లో 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్' రీమేక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప‌వ‌న్ కి జోడీగా సాయిప‌ల్ల‌వి న‌టించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంకా అధికారిక స‌మాచారం రాలేదు కానీ దాదాపుగా ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్ న‌టించ‌డం లాంఛ‌న‌మేన‌ని అంటున్నారు. అంతేకాదు.. సాయిప‌ల్ల‌వి రూ. 2 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినా చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్.. అంత రెమ్యూన‌రేష‌న్ ఇచ్చేందుకు ఏ మాత్రం ఆలోచించ‌లేదని టాక్. మ‌రి.. ఈ వార్త‌ల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.