English | Telugu

అప్పుడు రొమాన్స్... ఇపుడు రాఖీ

 

మొన్నటివరకు దర్శకుడితో చుమ్మా కార్యక్రమం పెట్టిన మిల్క్ బ్యూటీ తమన్నా తాజాగా రాఖీ పండగ కథ చెప్తుంది. బాలీవుడ్ దర్శకుడు సాజిద్‌ఖాన్‌-మిల్కీబ్యూటీలు లిప్ లాక్ చేసుకోవడం, ముద్దులు ఇచ్చి పుచ్చుకోవడం చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య జరిగిన రొమాన్స్ అంతా కూడా పుకార్లే అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు వీరిద్దరూ.

వీరిద్దరి గురించి రోజుకో వార్త బాలీవుడ్ లో హాల్ చల్ చేస్తున్నాయి. దాంతో ఈ విషయంపై దర్శకుడు సాజిద్‌ఖాన్‌ స్పందిస్తూ.... నాకు తమన్నాతో అలాంటి సంబంధం ఏమి లేదని, ఆమె తనకు చెల్లెలు వంటిది. తమన్నా నాకు రాఖీ కట్టిన చెల్లెలని తెలిపాడు. ఇలాంటి వార్తలు చూసి తనకు నవ్వు వస్తుందంటూ చెప్పుకొచ్చాడు.

ఈ విషయంపై తమన్నా కూడా అన్నయ్య సాజీద్ కు మద్దతుగా.... "హిమ్మత్‌వాలా" షూటింగ్ సమయంలో సాజిద్‌కు తను రాఖీ కట్టింది నిజమే. తనకు రక్షణగా ఉంటూ చెల్లెలిగా ఆదరిస్తున్నాడంటూ తమన్నా తెలిపింది.

అన్నచెల్లెల్లు అంటే లిప్ లాక్ లు, రొమాన్స్ లు కూడా చేసుకుంటారా అంటూ బాలీవుడ్ జనాలు వీరిద్దరి మాటలకూ కుళ్ళు జోకులు వేసుకుంటున్నారు.