English | Telugu

అన‌సూయ‌తో 'ఆర్ ఎక్స్ 100' హీరో చిందులు?

బుల్లితెర‌పైనే కాదు వెండితెర‌పైనా త‌న‌దైన ముద్ర‌వేసింది జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ అన‌సూయ‌. అటు కీల‌క పాత్ర‌ల్లోనూ, ఇటు ప్ర‌త్యేక గీతాల్లోనూ అల‌రిస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేప‌థ్యంలో.. మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో స్పెష‌ల్ డ్యాన్స్ నంబ‌ర్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. 'ఆర్ ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ క‌థానాయ‌కుడిగా 'చావు క‌బురు చ‌ల్ల‌గా' పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. 'అందాల రాక్ష‌సి' ఫేమ్ లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఓ ప్ర‌త్యేక గీతానికి స్థాన‌ముంద‌ట‌. సంద‌ర్భానుసారం వ‌చ్చే ఈ పాట‌లో కార్తికేయ‌తో క‌ల‌సి అన‌సూయ చిందులేయ‌బోతోంద‌ట‌. త్వ‌ర‌లోనే 'చావు క‌బురు చ‌ల్ల‌గా'లో అన‌సూయ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.ఇక ఈ ఒక్క సాంగ్ కోసం అనసూయ దాదాపురూ. 10 లక్షలు డిమాంగ్ చేస్తుందట.

కాగా, ప్ర‌స్తుతం అన‌సూయ చేతిలో మాస్ మ‌హారాజా ర‌వితేజ 'ఖిలాడి'తో పాటు క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ రూపొందిస్తున్న 'రంగ‌మార్తాండ' చిత్రాలు ఉన్నాయి. ఈ రెండింటిలోనూ అభిన‌యానికి అవ‌కాశ‌మున్న పాత్ర‌ల్లో అన‌సూయ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది.