English | Telugu

"ఆమె" కామెంట్‌కి సాయి ఏమన్నాడంటే..?

సినీ నటులు అన్నాకా కాంట్రవర్సీలు కామన్.. ఏ హీరో అయినా.. ఒక హీరోయిన్‌తో కాస్తంత చనువుగా ఉన్నారంటే చాలు. వారిద్దరి మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ నడుస్తుందంటూ పుకార్లు షికారు చేస్తాయి. మెగా హీరో సాయిథరమ్‌ తేజ్‌కి.. రెజీనాకి మధ్య ఎఫైర్ సాగుతోందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. వెంట వెంటనే ఇద్దరూ కలిసి మూడు సినిమాలు చేయడం కూడా ఈ వార్తలకు బలం చేకూరింది.

ఈ గాసిప్స్‌పై స్పందించిన రెజీ-సాయి‌ మాది ఫ్రెండ్‌షిప్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. అయితే మొన్నామధ్య ఒక ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ.. ప్రేమలో మోసపోయానని... అది నా పర్సనల్‌ లైఫ్‌తో పాటు.. ప్రొఫెషనల్‌ లైఫ్‌‌ మీద తీవ్రంగా ప్రభావం చూపిందని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇది జరిగిన తర్వాత ఇంతకీ రెజీనాని మోసం చేసింది ఎవరా అంటూ పెద్ద డిస్కషన్ నడిచింది. ఇదే విషయమై సాయిథరమ్‌ తేజ్‌ను అడగ్గా.. రెజీనాది వ్యక్తిగత విషయం.. దానిపై నేనేలా మాట్లాడగలను..? అది తప్పు కూడా అంటూ సున్నితంగా తప్పుకున్నాడు. అయితే.. రెజీనా - సాయిల మధ్య ఫ్రెండ్‌‌షిప్‌ ఏమంత బాగొలేదన్నది ఇండస్ట్రీ టాక్.