English | Telugu

అతి త్వరలో..!! నిర్మాత.. దర్శకత్వం.. వి.వి.వినాయక్..?

మాస్ కమర్షియల్‌ సినిమాలతో థియేటర్‌లోకి అడుగుపెట్టిన ప్రతీ ప్రేక్షకుడికి పైసా వసూల్ వినోదాన్ని అందించేందుకు తపన పడే దర్శకుల్లో వివి. వినాయక్ ఒకరు. అన్నీ మాస్ మసాలా కమర్షియల్ సినిమాలే తేసినా.. అందులోనే వైవిధ్యం చూపించారాయన. కమర్షియల్ ఎంటర్‌టైనర్లు తీయడం అందరి వల్ల కాదు. దాని లెక్కలు వేరు.. ఆ టెక్నిక్‌లు వేరు.. క్లాస్ ఆడియన్స్‌ చేత కూడా థియేటర్లో విజిల్స్ వేయించగల సత్తా వినాయక్ సొంతం. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న వినాయక్.. ఇప్పుడు టేకప్‌ చేస్తోన్న సినిమాలు ఆయనకు సరిపడవేమో అనే అభిప్రాయాన్ని సినీ జనాల్లో కలిగిస్తున్నాయి.

సాయిథరమ్‌ తేజ్‌తో తీసిన ఇంటిలిజెంట్ తప్పించి ఆయన చేతిలో మరో సినిమా లేదు. ఇలాంటి టైంలో వినాయక్ నిర్మాతగా మారబోతున్నాడంటూ ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఎప్పటి నుంచో తక్కువ బడ్జెట్‌లో.. కొత్తదనం నిండిన లవ్‌స్టోరీని తెరకెక్కించాలని వినాయక్ కల. తన నుంచి అందరూ కమర్షియల్ సినిమాలే ఆశిస్తారు కాబట్టి.. తనే నిర్మాతగా మారి దర్శకత్వం చేస్తే బెటర్ అన్నది వినాయక్ ఆలోచన. అందుకే ప్రొడక్షన్ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని ఫిలింనగర్‌ టాక్. అంటే వీలైనంత త్వరలో దర్శకత్వం.. నిర్మాత వివి. వినాయక్ అనే టైటిల్ కార్డ్‌.. వెండితెరపై పడనుందన్న మాట.