English | Telugu

తొలిప్రేమ ఓవర్సీస్ రిపోర్ట్

ఫిదా తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన సినిమా తొలిప్రేమ.. టీజర్, ట్రైలర్‌, సాంగ్స్‌‌ చూసిన వారికి ఇదేదో డిఫరెంట్ లవ్‌స్టోరీ అని అర్థమవుతుంది. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు హీరోగా సెట్ అవ్వడానికి బాగా హెల్ప్ అయిన.. తొలిప్రేమ టైటిల్‌ను వరుణ్ తన సినిమాకు పెట్టుకోవడం కూడా.. మెగాభిమానుల్లో క్యూరియాసిటీ కలిగిస్తోంది. ఫిబ్రవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఓవర్సీస్‌లో ఒకరోజు ముందుగానే రిలీజవుతోంది.

ఇప్పటికే ప్రీమియర్ షోలు పూర్తవ్వడంతో.. అక్కడివారు సినిమా విశేషాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఆదిత్యగా వరుణ్ తేజ్, వర్షగా రాశిఖన్నా ఆదరగొట్టేశారట.. ఫస్టాఫ్ అంతా కలర్‌ఫుల్‌గా సాగిపోతుందట. వరుణ్ - రాశి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందట. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోవడం తిరిగి ఒకే కాలేజీలో కలుసుకునే ట్రాక్ బాగుందట.. లండన్‌లో షూట్ చేసిన ఓ సాంగ్ సినిమాకే హైలెట్ అంటున్నారు ఆడియన్స్. హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం.. విడిపోవడం.. మళ్లీ కలుసుకోవడం లాంటి కథలు తెలుగు సినిమాకు కొత్త కాదు.. కాకపోతే ఈ సినిమాను అద్భుతమైన.. ఫీల్‌గుడ్ మూవీగా మలిచాడట దర్శకుడు వెంకీ అట్లూరి. మొత్తానికి వరుణ్‌ మరో కూల్ హిట్ కొట్టాడని ఓవర్సీస్ టాక్.