English | Telugu

సాయితేజ్ తో సంప‌త్ నంది సినిమా!

`సీటీమార్`తో మ‌ళ్ళీ ట్రాక్ లోకి వ‌చ్చేశాడు యువ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాతో మాస్ ఆడియ‌న్స్ ని బాగానే ఇంప్రెస్ చేశాడు. క‌ట్ చేస్తే.. త్వ‌ర‌లో మ‌రో ప‌వ‌ర్ ఫుల్ స‌బ్జెక్ట్ తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడట ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్. అంతేకాదు .. ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంద‌ని బ‌జ్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్.. సంప‌త్ నంది కాంబినేష‌న్ లో ఓ సినిమా నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తోంద‌ట‌. ఇందులో `సుప్రీమ్` హీరో సాయితేజ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు.. నెవ‌ర్ సీన్ బిఫోర్ రోల్ లో సాయితేజ్ క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే సాయితేజ్ - సంప‌త్ నంది - మైత్రీ మూవీ మేక‌ర్స్ కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ వ‌స్తుంది.

కాగా, సంప‌త్ నందితో మైత్రీ మూవీ మేక‌ర్స్ కి ఇదే మొద‌టి సినిమా కాగా.. సాయితేజ్ తో రెండో చిత్రం కానుంది. గ‌తంలో సాయితేజ్ - మైత్రీ మూవీ మేక‌ర్స్ క‌ల‌యిక‌లో `చిత్ర‌ల‌హ‌రి` వంటి స‌క్సెస్ ఫుల్ మూవీ వ‌చ్చింది. మ‌రి.. సెకండ్ జాయింట్ వెంచ‌ర్ తోనూ తేజ్ - మైత్రీ కాంబో మెస్మ‌రైజ్ చేస్తుందేమో చూడాలి.