English | Telugu

#NBK107.. బాల‌య్య‌ను ఢీకొట్ట‌నున్న సుదీప్‌!

'అఖండ' కెరీర్ బిగ్గెస్ట్ గ్రాస‌ర్‌గా నిల‌వ‌డంతో పాటు క‌లెక్ష‌న్ల ప‌రంగా టాలీవుడ్‌కు బూస్ట్‌నిచ్చిన ఫ‌స్ట్ బిగ్ ఫిల్మ్‌గా నిలవ‌డంతో నంద‌మూరి బాల‌కృష్ణ చాలా హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. ఆయ‌న‌ను ఎలా చూపించాలనే కిటుకు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌నుకు బాగా తెలిసింద‌నే పేరు వ‌చ్చింది. ఇప్పుడు.. ఆ కిటుకు త‌న‌కు కూడా తెలుస‌ని నిరూపించేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని. త‌న మునుప‌టి సినిమా 'క్రాక్‌'తో అత‌ను బిగ్ హిట్ సాధించాడు. ఆ సినిమాని ఎలాగైతే య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించాడో, ఇప్పుడు బాల‌కృష్ణ న‌టిస్తోన్న 107వ సినిమాని కూడా అదే త‌ర‌హాలో య‌థార్థ ఘ‌ట‌న‌ల‌తో తీసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.

Also read:'అఖండ' క‌లెక్ష‌న్ల‌ను త‌ట్టుకోలేక దిగాలుప‌డ్డ వ్య‌తిరేక వ‌ర్గం!

ముప్పై ఏళ్ల క్రితం నుంచి ప‌దేళ్ల క్రితం వ‌ర‌కూ కోస్తాంధ్ర ప్రాంతంలో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల‌ను స్ఫూర్తిగా తీసుకొని అల్లిన క‌థ‌తో ఈ సినిమాని గోపీచంద్ తీయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందులో బాల‌కృష్ణ జ‌నం దృష్టిలో రియ‌ల్ హీరో అయిన ఒక ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌ను చేస్తున్నారు. ఆయ‌న స‌ర‌స‌న నాయిక‌గా శ్రుతి హాస‌న్ న‌టించ‌నున్న‌ది. ఇప్ప‌టికే ఈ సినిమాని న‌వంబ‌ర్ 13న లాంచ్ చేశారు. వ‌చ్చే నెల‌లో షూటింగ్‌కు వెళ్ల‌నున్నారు.

Also read:'అఖండ‌'లో మెయిన్ విల‌న్ రియ‌ల్ లైఫ్‌లో మాజీ ఆర్మీ ఆఫీస‌ర్ అని మీకు తెలుసా?

కాగా, #NBK107లో బాల‌య్య‌ను ఢీకొట్టే ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్ ఎవ‌ర‌నే దానిపై కొన్ని రోజులుగా ర‌క‌ర‌కాల ఊహాగానాలు న‌డుస్తున్నాయి. అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఆ విల‌న్‌గా క‌న్న‌డ స్టార్ యాక్ట‌ర్ సుదీప్ న‌టించ‌నున్నాడు. రాజ‌మౌళి 'ఈగ' మూవీ త‌ర్వాత ఆయ‌న విల‌న్‌గా క‌నిపించ‌నున్న తెలుగు సినిమా ఇదే కానున్న‌ది. ఈ మ‌ధ్య‌లో ఆయ‌న 'బాహుబ‌లి'లో అస్లాం ఖాన్‌గా, 'సైరా' సినిమాలో అవుకు రాజుగా స్పెష‌ల్ అప్పీరెన్స్ ఇచ్చాడు. గోపీచంద్ చెప్పిన క‌థ‌, క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డంతో విల‌న్‌గా చేయ‌డానికి ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. తెర‌పై ఇద్ద‌రు కొద‌మ‌సింహాల్లాంటి న‌టులు త‌ల‌ప‌డుతుంటే ప్రేక్ష‌కుల‌కు క‌న్నుల‌పంటే. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అఫిషియ‌ల్ అనౌన్స్‌మెంట్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ నుంచి రానున్న‌ది.