English | Telugu
టాప్ హీరో కుమారుడితో అజయ్ భూపతి కొత్త సినిమా?
Updated : Sep 25, 2024
‘ఆర్‌ఎక్స్ 100’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత చేసిన ‘మహాసముద్రం’ అతని నిరాశపరిచింది. ఆ తరాత తన తొలి సినిమా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో రూపొందించిన ‘మంగళవారం’ చిత్రంతో మరోసారి ఘనవిజయాన్ని అందుకున్నారు అజయ్. గత ఏడాది విడుదలైన ఈ సినిమాతో విమర్శకుల అభినందనలు అందుకున్నారు. తాజాగా మరో కొత్త సినిమా ప్లానింగ్‌లో ఉన్నారు అజయ్.
తమిళ్ టాప్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్‌తో అజయ్ తన కొత్త ప్రాజెక్ట్ రెడీ చేసుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ధృవ్‌కి కథ చెప్పారని, అతను కూడా ఈ సినిమా చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పటివరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఉండే కథాంశంతో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. మరోవైపు ‘మంగళవారం2’ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారు అజయ్. అయితే ఈ సినిమా కంటే ముందుగానే ధృవ్‌తో చేసే సినిమా సెట్స్‌పైకి వెళుతుందని తెలుస్తోంది.